తెలంగాణ విధ్వంసానికి కారు కాంగ్రెస్ మజ్లిస్ కారణమంటూ బస్వ లక్ష్మీనరసయ్య ధ్వజం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Hyderabad

తెలంగాణ విధ్వంసానికి కారు, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలే చిరునామాగా మారాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గత ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమాన్ని విస్మరించి రాజకీయ లబ్ధికోసం పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పాలకుల వైఫై శైలిపై మండిపడ్డారు.