నా జీవిత కథపై సోనియా గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

రిపోర్టర్: విజయ్ స్థలం: న్యూఢిల్లీ

దశాబ్దాలుగా ఇతరులే తన జీవిత కథను చెబుతూ వచ్చారని, ఇప్పుడు తన కథను స్వయంగా ప్రపంచానికి వివరించే సమయం వచ్చిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పష్టం చేశారు. వచ్చే నెలలో విడుదల కానున్న తన ఆత్మకథకు సంబంధించి ఎక్స్ వేదికగా ఆమె మాట్లాడారు. ఈ పుస్తకం చదివిన తర్వాత ప్రజల్లో తనపట్ల విభిన్న స్పందనలు రావడం సహజమని ఆమె అభిప్రాయపడ్డారు.