ఐతంపాడులో ప్రభుత్వ భూముల ఆక్రమణపై రెవెన్యూ అధికారుల మౌనం
రిపోర్టర్: సునీల్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఐతంపాడులో వందల ఎకరాల పోరంబోకు, ఈనాం భూములు అన్యాక్రాంతమవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రీకొడుకులు ప్రజాప్రతినిధుల అండదండలతో సర్వే నంబర్లు ఒకటి, నాలుగు, ఏడులలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి దున్నేశారని ప్రజలు వాపోయారు. హైకోర్టులో పిటిషన్ నడుస్తున్నా లెక్కచేయకుండా చెట్లను నరికి కంచెలు వేస్తున్నారని విమర్శించారు. భూ ఆక్రమణలపై పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని కావలి ఆర్డీవో ఎలీషా స్పష్టం చేశారు.