'దరఖాస్తులు కోరుతున్నాం': అర్వపల్లి లక్ష్మీనరసింహ స్వామి పాలక మండలి నియామకం

రిపోర్టర్: రమేష్ స్థలం: సూర్యాపేట

సూర్యాపేట జిల్లా అర్వపల్లి శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ పాలక మండలి సభ్యుల నియామకానికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత గల ఔత్సాహికులు నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి 20 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నేర చరిత్ర లేని, దేవాలయం ద్వారా ఎలాంటి లబ్ధి పొందని వారు మాత్రమే దీనికి అర్హులని అధికారులు స్పష్టం చేశారు.