నెల్లూరు జిల్లాలో పరిషత్తు ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం

రిపోర్టర్: మహేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లాలో ఈనెల 5న జరగనున్న పరిషత్తు ఎన్నికలకు ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసినట్లు జడ్పీ సీఈవో మధుసూదన్ స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణకు దాదాపు పదకొండ వేల మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. మొత్తం ముప్ పై ఐదు జడ్పీటీసీ, నాలుగు వందల నలభై ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకగ్రీవాలు పోను మిగిలిన స్థానాలకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.