రైతుల ఆదాయం పెంపే హార్టికల్చర్ హబ్ లక్ష్యమని మంత్రి లోకేశ్ స్పష్టత
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రధాన లక్ష్యంగా హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వాటర్ మ్యాన్ అంటే కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అన్నదాతల సంక్షేమం కోసం అనేక ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.