మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాత

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలో దేవిశ్రీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం దుర్గా అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో ప్రత్యేక పూజలు అందుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలు నిర్వహించారు. పూజారుల ఆధ్వర్యంలో అమ్మవారి విశిష్టతను వివరించగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా సాగాయి.