విమానంలో తప్పిన పెను ప్రమాదం: వైద్యుల చొరవతో ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడు

రిపోర్టర్: మహేష్ స్థలం: Aizawl

దిల్లీ నుంచి ఐజ్వాల్ వెళ్తున్న ఇండిగో విమానంలో తీవ్ర అనారోగ్యానికి గురైన కిడ్నీ రోగిని నలుగురు వైద్యులు ప్రాణాలను కాపాడారని ఎన్డీటీవీ తెలిపింది. విమానంలోనే ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ప్రయాణికుడిగా ఉన్న డాక్టర్ విల్లీ లాల్హ్రూయిట్లువంగా మరియు ఇతర వైద్యులు తక్షణ వైద్యం అందించి ఆదుకున్నారు. ల్యాండింగ్ తర్వాత అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించినట్లు వైద్యులు వెల్లడించారు.