రుద్రమకోటలో ఓటర్ల జాబితాపై గ్రామసభ.. 912 మంది ఓటర్లు గుర్తింపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వేలేరుపాడు
వేలేరుపాడు మండలంలోని రుద్రమకోట గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం ఓటర్ల జాబితాపై ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ సురేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి స్థానిక కూటమి నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
గ్రామ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామంలో 912 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. మరణించిన వారు, గ్రామం విడిచి వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించామని, కొత్త దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.