నేలకొండపల్లిలో ఘనంగా వీరనారి చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ ముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం అమరమైనదని నాయకులు కొనియాడారు. ఆమె చూపిన ధీరత్వం నేటి తరానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని వక్తలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.