చెరువులో బంతి కోసం వెళ్లి: పదో తరగతి విద్యార్థి మృతితో విషాదం
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
నర్సీపట్నం రూరల్ పరిధిలోని జగన్నన్న కాలనీ సమీప చెరువులో బంతి కోసం వెళ్లిన పదో తరగతి విద్యార్థి యెనమరెడ్డి చరణ్ శ్రీనివాస్ రెడ్డి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మరో ఇద్దరు విద్యార్థులతో కలిసి ఆడుకుంటుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గంటపాటు గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ అకస్మిక మృతితో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.