అమెరికాలో ఘోర ప్రమాదం: రోలర్ కోస్టర్ నుంచి పడి వ్యక్తి మృతి

రిపోర్టర్: హరి స్థలం: అట్లాంటా

అమెరికాలోని ప్రముఖ అమ్యూస్మెంట్ పార్ కు సిక్స్ ఫ్లాగ్స్ లో జరిగిన ఘోర ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారని అధికారులు వెల్లడించారు. జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ లో గోలియత్ రోలర్ కోస్టర్ నుంచి పడి నలభై రెండేళ్ల హసన్ జిహాద్ ఇబ్న్ కరీమ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో నలుగురు మైనర్లు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో రెండు న్యాయ సంస్థలు దర్యాప్తునకు ఆదేశించాయి.