సాలూరులో విషాదం: వినాయక నిమజ్జనోత్సవంలో జనరేటర్‌పై పడి బాలికకు తీవ్ర గాయాలు
రిపోర్టర్: రమేష్
స్థలం: సాలూరు
సాలూరు పట్టణంలోని డబ్బివీధిలో జరిగిన వినాయక నిమజ్జనోత్సవంలో ఆదివారం అపశ్రుతి చోటుచేసుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు వచ్చిన సమయంలో తోపులాట జరగడంతో కొంకి వీధికి చెందిన పెద్దపల్లి చరిష్మా రోడ్డుపై ఉన్న జనరేటర్‌పై పడింది. ఈ ప్రమాదంలో బాలిక జుట్టు జనరేటర్ చక్రాలకు చుట్టుకొని తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్థానికులు ప్రైవేటు వాహనంలో సాలూరు ప్రాంతీయాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు విజయనగరం ఆసుపత్రికి తరలించారు.