న్యాయస్థానం ఆగ్రహం: ఇమ్రాన్ ఖాన్ లీవ్ ఇండియా నోటీసులపై హైకోర్టు స్టే
రిపోర్టర్: మహేష్
స్థలం: ముంబై
అమెరికా పౌరుడై ఉండి భారత ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసనల్ లో పాల్గొన్న నటుడు ఇమ్రాన్ ఖాన్ పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందని న్యాయవర్గాలు వెల్లడించాయి. రాజకీయ నిరసనల్ లో భాగస్వామి కావడాన్ని తప్పుబట్టిన కోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో నటుడు బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పోలీసులు జారీ చేసిన లీవ్ ఇండియా నోటీసులపై హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించి తదుపరి విచారణను డిసెంబర్ ఏడుకు వాయిదా వేసింది.