మచిలీపట్నం కార్పొరేషన్ ఎన్నికల పోరు: తెదేపా వైకాపా మధ్య నువ్వా నేనా

రిపోర్టర్: మహేష్ స్థలం: మచిలీపట్నం

మచిలీపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపా, వైకాపా ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నాయి. బీసీ మహిళలకు రిజర్వు అయిన ఈ స్థానంలో తెదేపా నుంచి అబ్దుల్ అబీదా, వైకాపా నుంచి లంకా జ్యోతి మేయర్ బరిలో నిలిచారు. మొత్తం అరువది డివిజన్లు ఉన్న ఈ నగరంలో కూటమి వైపు మొగ్గు ఉందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉందని స్థానికంగా చర్చ సాగుతోంది.