టెన్త్ విద్యార్థులకు అలర్ట్: మార్చి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: గోపి
స్థలం: విజయవాడ
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టరేట్ శనివారం అధికారికంగా విడుదల చేసింది. నవంబర్ పదకొండు నుంచి ఇరవై ఐదు వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని అధికారులు వెల్లడించారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యూడైస్ ప్లస్ లాగిన్ ద్వారా విద్యార్థుల వివరాలను పరిశీలించి ఆన్ లైన్ లో ఫీజులు చెల్లించాలని స్పష్టం చేశారు.