పామూరు ఎంపీటీసీ స్థానానికి పోటీకి సిద్ధమైన బీజేపీ నేత విజయ్ కుమార్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: పామూరు
పామూరు పట్టణ రెండో ప్రాదేశిక ఎంపీటీసీ స్థానాన్ని ప్రభుత్వం బీసీకి కేటాయించింది. ఈ నేపథ్యంలో విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా నాయకులు పెరమన విజయ్ కుమార్ చారి బరిలో దిగనున్నారు. పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.