కపటి గ్రామంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

రిపోర్టర్: KISHORE M స్థలం: ఆదోని

కపటి గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అంగన్వాడీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఆదోని బీజేపీ మండల అధ్యక్షులు ఉషా రాజు ఈ వేడుకల్లో పాల్గొని చిన్నారులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప్రాథమిక విద్యలో అంగన్వాడీల పాత్ర ఎంతో కీలకమని ఆమె పేర్కొన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.