బ్రెజిల్‌లో ప్రముఖ టిక్‌టాకర్ ఎవెలిన్ లిమా డాంటాస్ హత్య
రిపోర్టర్: శివ
స్థలం: బ్రెజిల్
బ్రెజిల్‌లోని మాఇ డో రియో ప్రాంతంలో ఇద్దరు దుండగులు టిక్‌టాకర్ ఎవెలిన్ లిమా డాంటాస్‌ను ఇంటి నుంచి బలవంతంగా బయటికి లాకెళ్లి కాల్చి చంపారు. జూలైలో స్థానిక పోలీసు సర్జెంట్ హత్య కేసులో అరెస్టై ఇటీవల సెప్టెంబర్ 9న బెయిల్‌పై విడుదలైన ఆమె, వారం రోజులకే హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు ప్రతీకార హత్య లేదా సాక్ష్యాల ధ్వంసం కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.