న్యూజిలాండ్ సిరీస్‌లో భారత్‌కు బుమ్రానే కీలకమన్న మిచెల్ సాంట్నర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: India
న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో భారత జట్టు విజయావకాశాలు పేస్ దళంపైనే ఆధారపడి ఉంటాయని న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ తెలిపారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని పేస్ దాడి కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితులకు త్వరగా అలవాటుపడటం భారత్‌కు సవాల్‌తో కూడుకున్నదని, అయితే బౌలింగ్‌లో వైవిధ్యం జట్టుకు అదనపు బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.