రైతన్నలకు తీపి కబురు: తెలంగాణలో భారీగా పెరిగిన కూరగాయల సాగు విస్తీర్ణం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
రాష్ట్రంలో సంప్రదాయ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నట్లు ఉద్యాన శాఖ అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత వానాకాలంలో కూరగాయల సాగు విస్తీర్ణం ఏకంగా అరవై ఆరు శాతం పెరిగి ఎనభై వేల ఎకరాలకు చేరినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్కెట్ డిమాండ్ కారణంగా నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్ లో సాగు విస్తీర్ణం గణనీయంగా వృద్ధి చెందిందని వ్యవసాయ నిపుణులు పేర్కొన్నారు.