వ్యాపారులకు భారీ ఊరట: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాల ప్రకటన
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశంలో వివిధ వస్తువుల పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. చిన్న వ్యాపారులకు పెద్దపీట వేస్తూ జరిమానాలను భారీగా తగ్గించారు. గతంలో ఉన్న ఇరవై ఐదు వేల జరిమానాను పది వేలకు కుదించారు. అధికారుల అరెస్టుల అధికారాన్ని రద్దు చేయడంతో పాటు ప్రాసిక్యూషన్ పరిమితిని ఐదు కోట్లకు పెంచినట్లు అధికారులు వెల్లడించారు.