జెర్రెల ప్రాంతంలో మళ్లీ బాక్సైట్ అలజడి
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జి.కె.వీధి
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలంలోని జెర్రెల ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై సీపీఎం, కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. త్వరలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని నాయకులు హెచ్చరించారు.