కుటుంబంతో గడపాల్సిన విలువైన సమయాన్ని కోల్పోయానంటూ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఆవేదన

రిపోర్టర్: గోపి స్థలం: ముంబై

సినిమా ప్రయాణంలో కోవిడ్ కాలమే తన జీవితంలో అత్యంత బలహీనమైన క్షణాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అంతర్జాతీయ సినీ ఉత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల పాటు విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల పిల్లల ఎదుగుదలను చూడలేకపోయానని కన్నీటిపర్యంతమయ్యారు. తనకు తెలియకుండానే పిల్లలు పెద్దవారయ్యారని, ఈ మధ్య కాలంలో కుటుంబం కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని ఆయన తెలిపారు.