అమెరికాలో ఘోర ప్రమాదం, వార్తా హెలికాప్టర్ కూలి ముగ్గురు మృతి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: అమెరికా
అమెరికాలోని లాస్ ఏంజెలిస్ సమీపంలో రోడ్డు ప్రమాద వార్తను కవర్ చేసి వెళ్తున్న న్యూస్ ఏజెన్సీ హెలికాప్టర్ కుప్పకూలింది. చాట్స్ వర్త్ ప్రాంతంలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో పైలట్, కెమెరామెన్ సహా ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారు. హెలికాప్టర్ లైవ్ కెమెరాలో రికార్డైన ఈ భయానక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాంకేతిక లోపమా లేక వాతావరణ ప్రభావమా అనే కోణంలో NTSB, FAA అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.