పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం: ఈ నెల ఇరవై ఒకటి నుంచి కార్యక్రమాలు

రిపోర్టర్: సునీల్ స్థలం: కామారెడ్డి

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ కామారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరవీరులకు ఘన నివాళులు అర్పించడంతో పాటు విద్యార్థులకు వ్యాసరచన, లఘు చిత్రాల పోటీలు, రక్తదాన శిబిరాలు, అవగాహన ర్యాలీలు, ఓపెన్ హౌస్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ వేడుకల వివరాల కోసం ఎనిమిది ఏడు ఒకటి రెండు ఐదు రెండు ఆరు ఒకటి ఒకటి మూడు నంబరును సంప్రదించాలని సూచించారు.