భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్గా అభిషేక్ శర్మ: యువరాజ్ సింగ్ జోస్యం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
యువ ఆటగాడు అభిషేక్ శర్మలో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, భవిష్యత్తులో అతను భారత జాతీయ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించే సత్తా ఉందని మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నారు. తోటి ఆటగాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించే గుణం అతనిలో స్పష్టంగా కనిపిస్తోందని, ఐపీఎల్ లో జట్టును నడిపించడం ద్వారా జాతీయ జట్టు సారథ్యానికి తగిన ఆత్మవిశ్వాసం వస్తుందని యువరాజ్ సింగ్ వెల్లడించారు.