వన్యప్రాణుల రక్షణ కోసం యాప్ రూపొందించిన ఎనిమిదేళ్ల బాలుడు

రిపోర్టర్: నరేష్ స్థలం: World

అమెరికా మరియు కెనడా దేశాలలో పెరుగుతున్న వన్యప్రాణుల సంచారాన్ని గుర్తించడానికి ఎనిమిదేళ్ల వియోహన్ అనే బాలుడు 'అర్బన్ వైల్డ్ వాచ్' అనే వినూత్న యాప్‌ను రూపొందించాడు. జంతువులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను డెవలప్ చేశాడు. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 150కి పైగా జంతువుల సంచార వివరాలు నమోదయ్యాయి.