ఘజియాబాద్‌లో అపార్ట్‌మెంట్ ఫ్ట్‌లో యువకుడు మూత్ర విసర్జన

రిపోర్టర్: మహేష్ స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న షిప్రా కృష్ణ విస్టా సొసైటీలో దారుణ ఘటన వెలుగు చూసింది. అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లోకి ఎక్కిన ఓ యువకుడు కంట్రోల్ ప్యానెల్ వద్ద బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. ఈ తతంగం మొత్తం లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా ఈ ఘటన బయటపడింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నివాసితులు సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.