'ఆర్ఎస్ఆర్ హైస్కూల్ ఆధునీకరణ అద్భుతం': తెలుగు దేశం పార్టీ
రిపోర్టర్: రమేష్
స్థలం: Nellore
నెల్లూరులో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఆర్ హైస్కూలును అద్భుతంగా ఆధునీకరించారు. ఈ పాఠశాలను ప్రారంభించిన అనంతరం తెలుగు దేశం పార్టీ తరఫున నాయకులు అంతటా కలియతిరిగి తరగతి గదులు, ల్యాబ్ లు, డైనింగ్ హాల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి, బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని తెలుగు దేశం పార్టీ ఆకాంక్షించింది. విద్యారంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.