కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసీఆర్ కుటుంబ భూములపై కమిషన్‌ను ఏర్పాటు చేశారన్న బీఆర్‌ఎస్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో ప్రజాసమస్యలను గాలికొదిలేసిన రేవంత్ సర్కార్ కేవలం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ జీవో 134 ద్వారా నలుగురు ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంపై సీఎం చేసిన ఆరోపణలు అబద్ధమని సర్వేలో తేలడంతో, ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ డైవర్షన్ డ్రామాలకు తెరతీశారని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.