అదృశ్యమైన యువకుడి ఆచూకీ కోసం పోలీసులను కోరిన జాన్సన్ నాయక్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కడం

మంచిర్యాల జిల్లా కడం మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ అభి కనిపించకుండా పోవడంతో బీఆర్ఎస్ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఖానాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. యువకుడి ఆచూకీని వీలైనంత త్వరగా గుర్తించి క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేశారు.