సుద్దాల అశోక్ తేజకు తెలంగాణ తెలుగు తేజం పురస్కారం
రిపోర్టర్: సతీష్
స్థలం: కరీంనగర్
ప్రముఖ కవి, సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ 2026 సంవత్సరానికి గాను 'తెలంగాణ తెలుగు తేజం' సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు. తెలుగు భాషా సంరక్షణ సంఘం, తెలంగాణ సాహితీ సంస్థ సంయుక్తంగా ఈ అవార్డును అందజేస్తున్నాయి. ఈ నెల 22న కరీంనగర్‌లో ఘనంగా పురస్కార ప్రదానోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.