దేశంలో భారీగా పెరిగిన నగదు చలామణి: ఐదేళ్ల గరిష్టానికి చేరిన వైనం

రిపోర్టర్: సురేష్ స్థలం: తెలంగాణ

భారత ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ లావాదేవిల జోరు పెరుగుతున్నప్పటికీ, ప్రజల వద్ద చలామణిలో ఉన్న నగదు గణనీయంగా పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈనెల 15వ తేదీ నాటికి దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నగదు విలువ ఏకంగా రూ.43.46 లక్షల కోట్లకు చేరిందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 13.5 శాతం వృద్ధి రేటుగా నమోదైందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.