రోడ్డు ప్రమాదంలో ప్రముఖ గాయకుడు యో యో హనీ సింగ్ మేనల్లుడు మృతి
రిపోర్టర్: రాము
స్థలం: జలంధర్
పంజాబ్ లోని జలంధర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ యో యో హనీ సింగ్ మేనల్లుడు విదిత్ ఓలక్ మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. పుట్టినరోజు వేడుక ముగించుకుని కారులో ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ట్రాక్టర్ ట్రాలీని వారి కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విదిత్ తో పాటు మరొకరు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబాల్ లో తీవ్ర విషాదం అలుముకుంది.