గుర్గావ్లో దారుణం: రిటైర్డ్ ఉపాధ్యాయురాలిని గొంతు నులిమి హత్య చేసిన నిందితుడు

రిపోర్టర్: సతీష్ స్థలం: Gurugram

గుర్గావ్లోని న్యూ కాలనీలో దొంగతనం కోసం ప్రవేశించిన దుండగుడు అడ్డుకున్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మధు శర్మను గొంతు నులిమి కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం నిందితుడు సూరజ్ గుప్తాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదికలో గొంతు నులమడం వల్లే మరణం సంభవించినట్లు వైద్యులు నిర్ధారించారని అధికారులు పేర్కొన్నారు.