భారత్ లో సీ 130జె విమానాల తయారీకి లాక్ హీడ్ మార్టిన్ సిద్దం

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

భారత రక్షణ శాఖ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 60 మీడియం ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంటే సీ-130జె సూపర్ హెర్క్యులస్ విమానాల తయారీకి పూర్తి సాంకేతిక బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా రక్షణ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ వైస్ ప్రెసిడెంట్ రాబర్ట్ టోత్ వెల్లడించారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్‌తో కలిసి భారత్‌లో తయారీతో పాటు ఇప్పటికే ఉన్న 12 విమానాలను కూడా ఆధునీకరిస్తామని ఆయన తెలిపారు.