తుపాను నష్టాలపై కేంద్రంపై ఒత్తిడి: సీఎం చంద్రబాబు కీలక లేఖలు

రిపోర్టర్: మహేష్ స్థలం: అమరావతి

తుపానుల కారణంగా పంటలు కోల్పోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్రంపై సీఎం చంద్రబాబు ఒత్తిడి పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అర్నబ్, మురసు తుపాన్ల నష్టాలపై కేంద్ర హోంమంత్రి అమిత్షాతో పాటు పలువురు మంత్రులకు లేఖలు రాసినట్లు అధికారులు తెలిపారు. తక్షణ సాయం కింద రూ.4,563 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. అలాగే కొలంబో పోర్టులో నిలిచిపోయిన మిర్చి ఎగుమతులపై కూడా కేంద్ర వాణిజ్య మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.