సెల్‌ఫోన్ మందలించారని.. మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ద్వారకా తిరుమల
ద్వారకాతిరుమల మండలంలోని గుండుగొలనులో విషాదం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడుతున్నాడని తండ్రి రాంబాబు మందలించడంతో, మనస్తాపానికి గురైన దొరేపల్లి దేవ వెంకట తరుణ్‌కుమార్ (17) తోటలోకి వెళ్లి గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ టీ.సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.