ఈనాడు ఈటీవీ వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చాటిన రాజాం మండల విద్యార్థులు

రిపోర్టర్: RAMESH LAVETI స్థలం: రాజాం

రాజాం మండలం డోలపేట విద్యార్థులు ఈనాడు, ఈటీవీ వారు నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను పాఠశాల కమిటీ సభ్యులతో పాటు ఆంగ్ల ఉపాధ్యాయులు రుంకు శ్రీనివాసరావు మరియు పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణించాలని వారు ఆకాంక్షించారు. ఈ విజయం పట్ల స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.