అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్ వైపు భారతీయ ఓటర్ల మొగ్గు

రిపోర్టర్: వెంకట్ స్థలం: World

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ ఓటర్లు డెమొక్రటిక్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 66 శాతం మంది డెమొక్రటిక్ అభ్యర్థులకే ఓటు వేస్తామని తెలిపారు. ద్రవ్యోల్బణం, జీవన వ్యయం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో అత్యంత ప్రధాన సమస్యలుగా మారినట్లు సర్వే స్పష్టం చేసింది. రాజకీయాలపట్ల కొంత అసలట ఉన్నప్పటికీ ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.