విజయవాడ ఉత్సవ్‌కు ఘనంగా ఏర్పాట్లు: సీజన్ రెండుకు అంకురార్పణ
రిపోర్టర్: అశోక్
స్థలం: విజయవాడ
విజయవాడలో దసరా శోభను మరింత వైభవంగా చాటిచెప్పేలా నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ సీజన్ రెండు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టినట్లు ఏపీ కల్చరల్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ తేజస్విని వెల్లడించారు. సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఉత్సవ పనులకు ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ నెల పదకొండు నుంచి ఇరవై వరకు పున్నమిఘాట్ తో పాటు వివిధ వేదికలపై జాతీయ, అంతర్జాతీయ కళాకారుల ప్రదర్శనలు, సంగీత కచేరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు.