లక్నోలో దారుణం: భార్య, కుమార్తెను చంపి లొంగిపోయిన హోంగార్డు

రిపోర్టర్: రాజేష్ స్థలం: లక్నో

కుటుంబ కలహాలు మరియు తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా భార్యను, కుమార్తెను హత్య చేసినట్లు హోంగార్డు రవీంద్ర శంకర్ సాహు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. లక్నోలోని కృష్ణానగర్ ప్రాంతంలో నిద్రమాత్రలు కలిపిన టీ ఇచ్చి, గాడ్జెట్ ఛార్జింగ్ కేబుల్తో గొంతు నులిమి వారిద్దరిని దారుణంగా హత్య చేసినట్లు నిందితుడు వెల్లడించారు. ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు అదనపు డీసీపీ రల్లపల్లి వసంత్ కుమార్ వెల్లడించారు.