హైదరాబాద్లో కోటెక్నా భారీ కొనుగోలు: ఎనర్జాన్ ల్యాబ్స్ చేజిక్కించుకున్న దిగ్గజ సంస్థ

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

లైఫ్ సైన్సెస్ రంగంలో అంతర్జాతీయంగా పేరుగాంచిన స్విట్జర్లాండ్ దిగ్గజం కోటెక్నా గ్రూప్ హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఎనర్జాన్ ల్యాబ్స్ను కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ వ్యూహాత్మక ఒప్పందంతో భారత్, అమెరికా సహా వివిధ దేశాల్లో ఫార్మా విశ్లేషణాత్మక సేవలు మరింత వేగవంతంగా అందుబాటులోకి వస్తాయని సంస్థ పేర్కొంది. గ్లోబల్ ఫార్మా హబ్గా ఉన్న హైదరాబాద్ వేదికగా తమ సేవలను మరింత విస్తరిస్తామని వెల్లడించారు.