కుక్కునూరును ఒక యూనిట్ గా పరిగణించి పరిహారం అందించాలన్న నాగమణి
రిపోర్టర్: venkat
స్థలం: కుక్కునూరు
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ, పునరావాస చట్టం ప్రకారం పూర్తి పరిహారం, పునరావాసం కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మెడియం నాగమణి డిమాండ్ చేశారు. కుక్కునూరును ఒక యూనిట్‌గా పరిగణించి 41.15 కాంటూర్, మొదటి, రెండో దశల పేరుతో నిర్వాసితులను విభజించరాదన్నారు. తరలించే నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.