పాలమూరు గడ్డపై బీఆర్ఎస్ వ్యూహాలు: మాజీ సీఎం కేసీఆర్ రాజకీయ కసరత్తు
రిపోర్టర్: సురేష్
స్థలం: Mahabubnagar
ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంగా గులాబీ పార్టీ భవిష్యత్తు రాజకీయ రణక్షేత్రానికి తెరలేపింది. గత అసెంబ్లీ ఎన్నికల్ లో ఎదురైన పరాజయంతో గులాబీ శ్రేణులు మళ్లీ పట్టు సాధించేందుకు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేశాయి. తెలంగాణ ఉద్యమానికి అండగా నిలిచిన ఈ గడ్డపైనే మరోసారి పట్టు సాధించాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా దృష్టి సారించినట్లు రాజకీయ విశ్లేషకులు తెలిపారు.