తెలంగాణ బిజెపి కార్యాలయంలో ఘనంగా హైదరాబాద్ విమోచన వేడుకలు
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పాల్గొని భరతమాత, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖాధికారులు, పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.