ప్రాజెక్టులు భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశం

రిపోర్టర్: భాస్కర్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మరియు భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. అమరావతి నుంచి ఉన్నతాధికారులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి, అనుసంధాన రహదారులు, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ కేంద్రం పనుల పురోగతిని వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.