ప్రధాన రహదారి గుంతలకు మున్సిపల్ అధికారుల తక్షణ మరమ్మతులు
రిపోర్టర్: fast news
స్థలం: జంగారెడ్డిగూడెం
జంగారెడ్డిగూడెం స్థానిక సౌభాగ్య థియేటర్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఏర్పడిన ప్రమాదకర గుంతలకు శనివారం మున్సిపల్ కమిషనర్ కే. వెంకటరమణ తక్షణ మరమ్మతులు చేయించారు. సిమెంట్ కాంక్రీట్‌తో పనులు పూర్తి చేయించి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టడంతో, ఆయన స్పందించిన తీరుపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.