పిల్లల్లో కిడ్నీ వ్యాధులకు కారణమయ్యే కొన్ని సాధారణ అలవాట్లు

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

పిల్లల దైనందిన అలవాట్లు వారి కిడ్నీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అమృత ఆస్పత్రి నెఫ్రాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ ఉర్మిళ ఆనంద్ వెల్లడించారు. మూత్రం ఆపుకోవడం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, మలబద్ధకాన్ని నిర్లక్ష్యం చేయడం మరియు మందులను తప్పుగా వాడటం వంటి పొరపాట్లు పిల్లల్లో కిడ్నీ సమస్యలకు దారితీస్తాయని ఆమె హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల అనారోగ్య లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన వైద్య సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.